పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

555


విఱుగఁడే పదిమార్లు విక్రమంబెడలి !
మెఱసి జరాసంధు మేటిసాహసుని
భీమార్జునులఁ దోడువెట్టుక పోయి
భూమిసురాకృతిఁ బొంగణఁగించె ;
నిది విక్రమంబె మహీమండలమున !
మదదైత్యహరు నేల మాటిమాటికిని
బొగడుచున్నాఁడవు [1]బూతుచందమున !
పొగడక నీకును బొద్దు [2]పో దేని
సుగుణాకరులు రణశూరులై నట్టి
జగదీశ్వరులు కర్ణశల్యులాదిగను
యోధులఁ బొగడు మత్యున్నతితోడ.
సాధునిందయు నన్యజనకీర్తనంబుఁ
జేయరు గాంగేయ, సృష్టినుత్తములు
ఏయెడ నని మునులెంతయు ననిరి."
అనుచును దుర్భాషలాడుట చూచి
యనిలతనూభవుండలిగి రౌద్రమునఁ
బ్రలయకాలమునాఁటి ఫాలాక్షుపగిదిఁ
గలనను శిశుపాలు ఖండింపఁజూడ,
భీమునివారించి భీష్ముఁడిట్లనియె:

శిశుపాలుని జన్మవృత్తాంతము

"ఈదురాత్ముండు మహీస్థలిఁ దొల్లి
చేదివంశమునఁ బ్రసిద్ధుఁడైనట్టి
యాదమఘోషున కాసాత్వతికిని
బుట్టెను ఘనచతుర్భుజములతోడ,
నెట్టనంబుగ ఫాలనేత్రంబుతోడ,

  1. పూత.
  2. పోదెందు. (మూ)