పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/617

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

551


గానంగఁబడుఁగాక ; కష్టజీవులకు
నేనాఁటఁ గనఁబడు నిందిరాధిపుఁడు?”
అని భీష్ముఁడాడినయవసరంబున ను
అనఘుఁడై నట్టి సహాదేవుఁడపుడు
పలికె: "శ్రీకృష్ణునిఁ బద్మలోచనునిఁ
గలుషుఁడై దూషించు కపటాత్ముతలను
జరణంబుఁబెట్టెదఁ జయ్యన." ననుచు
నరుగుదెంచినఁ, జూచి యాసభ వారు
భయమందియుండిరి; బ్రహ్మాదిసురలు
రయమున దివినుండి రాజితంబైన
పుష్పవర్షంబులు పొలుపుమీఱంగ
నిష్పత్తిఁగురిపించి నిగుడిరి; యంతఁ
గలహబంధుండైన ఘనుఁడు నారదుఁడు
పలుమాఱు నృత్యంబు పటుభంగి నాడె.
అంతట శిశుపాలు నాత్మసైనికుఁడు
దంతివైరిబలుండు దగు [1]సునీధుండు
కోపించి సేనలఁగూడి తానుండ,
నేపార శిశుపాలు నెల్లసైన్యముల
రవమున కప్పుడు రాజసైన్యాబ్ధి
వివిధభంగుల నందు వేగంబె కలఁగె.
అతులభయంకరంబైన యారవము
నతిచిత్రముగ విని యమనందనుండు
గాంగేయునకు భక్తిగలిగి యిట్లనియె:
"సంగరవిజయులు జగదీశులెల్ల
మొరయుచున్నారు సముద్రములట్లు ;
గరిమ నామఖము విఘ్నము నొందకుండ


  1. సునాముండు. (మూ)