పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

550

ద్విపద భారతము.


బాలుఁడైయున్నను బ్రాహ్మణోత్తముఁడు
చాలంగఁ బూజ్యుండు జగములయందు;
నతులవిక్రమశాలియౌ మహీవిభుఁడు
సుతికిఁ బాత్రుండెందు నూతనశ్రీల ;
నీ రెండువిధముల నెలమిఁగృష్ణుండె
యారయ [1]నర్హుఁ డర్ఘ్యంబునకిలను..
నచరాచరంబైన జగములకెల్లఁ
బ్రచురంబుగాఁ గర్త పద్మలోచనుఁడు.
వృద్ధులై యుండియు విశ్వంబులోన
బుద్ధులు లేనట్టి పురుషులేమిటికి !
పరమాత్ముఁ డాద్యుండు భక్తవత్సలుఁడు
........ ........ ......... ........ ....... ........
కర్తగావునఁ బూజ కడిఁగిచేసితిమి.
మూర్తిత్రయాత్మకు మురవైరి భక్తిఁ
బూజించినను మహాభువనంబులెల్లఁ
బూజితంబులయగు భూరి తేజమున.
బుద్ధియు మనమును బుండరీకాక్షుఁ
డిద్ధ తేజుఁడు పరమేశుఁ డవ్యయుఁడు ;
చెలువొందుప్రకృతియుఁ జిరపరంజ్యోతి
జలజారి సూర్యులు జగతియు గాడ్పుఁ
బావకుండును నభోభాగంబు యముఁడు
దేవేంద్రుఁడును మునిదిక్పతితతియు
సకలభూతంబులు సచరాచరములు
వికచాబ్జనేత్రుండు వెలయంగఁ దానె.
యిట్టిమహా [2]త్మకుఁ డిందిరాధిపుఁడు
నెట్టణంబుగ యోగినివహంబులకును

  1. నర్హంబులవనిలోపలను.
  2. త్ముని యిందిరాధీశు. (మూ)