పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

547


యితనికి బహుమాన మిటుసేయఁదగునె!
క్షితిఁ బెద్దయనుచుఁ బూజించితే కృష్ణు !
వసుదేవుఁడుండంగ వసుమతీనాథ !
అసమాన ఋత్విజుండనివిచారించి
వరుసఁబూజించితే వ్యాసుఁడుండఁగను !
హరిని నీవాచార్యుఁడని కొల్చి తెట్లు ?
ద్రోణుండు కృపుడును [1]ద్రౌణియుండఁగను ;
క్షోణీశుఁడని పూజ సొరిదిఁ జేసితివొ !
యాదవు లెచ్చోట నవనినాయకులె !
మేదినిలోన నమితధర్మపరులు
పూజనీయులు గుణాంభోనిధులుండఁ,
బూజించి తేలయ్య పుష్కరనయను !
బాలిశుండగు భీష్ముపలుకులునమ్మి
బేలవై తేలయ్య పృథివీశతిలక !
నీవధికుఁడవని నిఖిలభూపతులు
వే వేగవచ్చిరి వేడుకతోడ
నీమఖంబునకును నెఱివచ్చినట్టి
యామహాత్ములనెల్ల యవమాన మేల.
చేసి కృష్ణునిఁ బూజచేసితివీవు!
ఈసమస్తధరిత్రి నిటధర్మతనయ,
ధర్మమేనీకును ! ధర్మాత్మ, వినుము
ధర్మంబెఱుంగకిత్తఱిని నీవిడిన
భావంబునకు సిగ్గుపడక యర్ఘ్యంబు
గోవిందునకు నందుకొన నుచితంబె!
భువి నపుంసకునకుఁ బూర్ణేందుముఖియుఁ,
జెవిటికి గీతంబుఁ, జీకు కద్దంబు,

  1. ద్రోణుండుండంగను. (మూ)