పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

546

ద్విపద భారతము.


హరిపూజసేయుట యజ్ఞ ఫలంబు
సరసత్వమున నీకు సమకూరు. " ననిన
నొగి నాసహాదేవుఁ నుదకంబుఁబోయ
నిగమవేద్యుండైన నీరజాక్షునకుఁ
బూని యర్ఘ్యంబిచ్చి పూజసేయుటయు,
దాని సహింపకత్తఱిఁ గలుషించి
శ్రీకృష్ణుదూషించి శిశుపాలుఁడపుడు
శ్రీకరుండగు యుధిష్ఠిరునకిట్లనియెఁ ;

శిశుపాలుఁడు ధర్మజునధిక్షేపించుట

"బట్టాభిషిక్తులు బలసియుండఁగను
నెట్టణంబుగ ధర్మ [1]నియతులుండఁగను
అతివిష్టాచార్యులార్యులుండఁగను
మతిదప్పి భీష్మునిమాటలునమ్మి
యేల దాశార్హుని నిల నర్హుడనుచుఁ
జాలఁబూజించితి సద్భక్తితోడ?
కురువృద్ధుఁడగు భీష్మకువలయేశ్వరుఁడు
పరధర్మ మెఱుఁగక వాసుదేవునకు
జడునకు నేల పూజలుసేయఁబనిచె ?
[2]వెడగుఁదనంబిది ; వృద్ధున కేల
బుద్ధులుగలుగును భువనంబునందు !
నిద్ధ తేజులు విప్రు లెల్లభూపతులు
[3]నుండంగ, నర్ఘ్యంబు నుచితో క్తినిచ్చి
పుండరీకాక్షునిఁ బూజింపఁదగునె !
అతనికిఁ గూర్తురే నఖిలసంపదలు
నతివేగమున నిచ్చుటదితగుఁగాని ;

  1. నీతు.
  2. ఉడుగు.
  3. చూడంగ. (మూ)