పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

545


యదువంశమునఁ బుట్టె నఖిలంబునెఱుఁగ ;
మధువైరిపనుపున మనుజేంద్రులెల్ల
యక్షగంధర్వ విద్యాధర సిద్ధ
రాక్షసాంశంబులఁ బ్రభవించిరుర్వి."
ననుచు నానారదుండనిన, వారలకు

ధర్మజుఁడు శ్రీకృష్ణుఁ బూజించుట
ననఘుండు భీష్ముఁడిట్లనియె : “ఋత్విజుఁడు
గురుఁడు స్నాతకుఁడు సత్కువలయేశ్వరుఁడు
వరసంయమియు మునివర్ణితయశులు
పూజనీయులు వీరు పుణ్యచరిత్ర!
రాజితంబునను వీరలలోనఁ బెద్ద
యగువానిఁబూజింపు." మనిచెప్పుటయును,
దగ ముదంబంది యాధర్మనందనుఁడు
గాంగేయుతోడను గడఁగి యిట్లనియె:
[1]ఆంగికు లుత్తములగు వీరిలోన
నెవ్వనిఁబూజింతు నెఱిఁగింపు." మనిన
నవ్వసుధీశుతో నాతఁడిట్లనియె :
"సర్వలోకములను సర్వ తేజములఁ
బర్వెడి సూర్యునిభాతి, సుధాంశుఁ
డేపారఁగా ధాత్రి నెల్ల కాంతులను
జూపట్టుభంగిని శోభితంబుగను
దనదీప్తి జగములఁ దగ వెలిఁగించు
ఘనుఁడచ్యుతుండు పంకజలోచనుండు
పరికింప నర్హుండు పసనర్ఘ్యమునకు ;
నొరులరుహులుగారు యుక్తి భావింప.

  1. ఈపదమునీతఁడు పదింపది గాఁ బ్రయోగించును : సభ్యులనియూహయా!