పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

541


క్రమమెల్లఁజెప్పి వేగమునరండనినఁ
బ్రముదితంబుగను గుంభజ భీష్మ విదుర
ధృతరాష్ట్ర కృప కర్ణ ధృతిసోమదత్త
చతురభూరిశ్రవ శ్శల్య సైంధవులు
దుర్యోధనుండును దుశ్శాసనుండు
[1]నార్యనిగ్రహుఁడైన యాశకునియును
వచ్చిన, నవ్వేళ వరుసతోడుతను
ముచ్చికఁబూజించి మనుజేంద్రుఁడనియె :
"మీయనుగ్రహముస మెఱసి యీక్రతువు
సేయంగఁబూనితిఁ జిత్రంబుగాను ;
ఇదినిర్వహింప మీరెంతయు వలయు
విదితంబుగా. " నని వెస వారియాజ్ఞఁ
బడసి ధర్మజుఁడు ప్రభావంబునందుఁ
గడఁగి హాటకరత్న ఘనదానతతులు
పెట్టంగ [2]నియమించెఁ బేర్మితోఁ గృపున ;
గట్టిగా నౌఁగామికార్యముల్ దెలియ
గాంగేయ ద్రోణులఁ [3]గర్తలఁజేసె;
సంగతి మీఱంగ సకలార్థములకుఁ
గలయరాజులుదెచ్చు కప్పంబులకును
గొలఁదితో నీఁబుచ్చుకొనఁ గర్తఁజేసె
విదురుని బహునీతివిదుని నుత్తముని;
ముదమున నిష్టాన్నములు భక్తిఁబెట్టఁ
దుదిని గట్టడచేసె దుశ్శాసనునిని ;
బదవితో మణిహేమభండారములకుఁ
గురురాజుఁ గర్తగాఁ గొనకొనిచేసె.
నిరుపమాలంకార నీతిశోభితుఁడు

  1. ఆర్యాది.
  2. నిర్మించె.
  3. గర్తగా. (మూ)