పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

537


దక్షిణభూమికిఁ దద్దయునేఁగి
రాక్షసేంద్రుఁడు రఘురామభృత్యుండు
శ్రీవిభీషణునకుఁ జెప్పిపంపినను,
భావించి యతఁడును భక్తితోడుతను
[1]శ్రీరాముమాడలుఁ జింతితార్థములు
వారణ హయ రథవ్రాత రత్నములు
నెసగఁ జతుర్దశహేమతాళములు
నసమాంబరంబులు నఖిలార్థములును
బంపెను సహదేవపార్థి వేంద్రునకు.
సొంపొంద నదిగొని చూచి మాద్రేయుఁ
డంతన పౌలస్త్యునధిపులచేత
నెంతయుఁ గప్పంబు లింపుగాఁగొనుచు
సహదేవుఁడేతెంచె జనలోకనాథ,
విహితప్రతాపుఁడై విశ్వంబుపొగడ.

నకులుని పశ్చిమదిగ్విజయము

నకులుండు సతులితోన్నతపరాక్రముఁడు
వకుళవ్రనూనోరు వరకచభరుఁడు
బలములుగొలువంగఁ బ్రఖ్యాతముగను
దెలివితోఁ బశ్చిమదిక్కున కేఁగి
కరి తురంగ భటప్రకరఘట్టనలను
శరధులుఘూర్ణిల్ల, సంభ్రమంబునను
మాద్రేయుఁ డత్యుగ్రమానుషంబునను
భద్రసైన్యంబులు బహుముఖంబులుగ
నరుదేర [2]మాహితకావనీశ్వరులఁ
దెఱఁగొప్పఁగా లాటదేశాధిపతుల

  1. రామనామాంకితములగు నాణెములు గాఁబోలు.
  2. మహితఉద్యాన నీశ్వరుల. (మూ)