పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

534

ద్విపద భారతము.


చతురోక్తిఁబలికె వైశంపాయనునకు :
"బ్రతిభటుండై వచ్చి పావకుండేల
యాసహదేవుని నపుడు డగ్గఱెను?
ఈసమయంబున నింతయుఁదెలుపు,"
మనిన నమ్మునివరుం డతనికిట్లనియె :
"జననాథకులవార్ధచంద్రుఁడైనట్టి
నీలువంశంబున నిషధుండు ధాత్రి
యేలంగ, వహ్ని మహీదేవుఁడగుచు
వేదంబుచదువుచు వేడ్కఁ దత్పురము
సాదరంబునఁజొచ్చి, చక్కనియువతి
బరసతిఁ బట్టుక భావజుకేళి
సరసతసలుపంగ, జనపతిహితులు
పట్టుకవచ్చి భూపతిమ్రోలఁబెట్టి
పెట్టిన[1] శాస్త్రసంప్రీతితో నతని
దండింపఁబోయిన, దహనుఁడై మిగుల
మండుచునుండిన, మానవేశ్వరుఁడు
వెఱచి పావకునకు వెసమ్రొక్కిపలికె:
“నెఱుఁగగ యజ్ఞాన మిపుడు చేసితిని
మన్నించు.” మనవుడు మఱి పావకుండు
సన్నిధియై మహీశ్వరున కిట్లనియె:
“నడుగు నీకోరినయట్టివరంబు
తడయకిచ్చెద." నన్న దహనునకనియె:
“నాపురిమీఁద నేనరపతులైన
నేపారవచ్చిన నెంతయు నీవు
కదియు వారలమీఁద గ్రక్కున." ననిన
వదలక యగ్నియు వరమిచ్చిపలికె:

  1. శాస్త్రసమ్మతముతో నని యర్థము కాఁబోలు!