పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

532

ద్విపద భారతము.


జేదిభూమికివచ్చి శిశుపాలుచేతఁ
బ్రోదిమీఱంగను బూజితుండగుదు
నతినిచే శమనసుతాధ్వరంబునకు
నతులితంబైనట్టి యర్థంబు గాంచి,
చేది దేశము వెళ్ళి చిత్రునిఁగాంచి
[1]మేదినీశు సుపార్శ్వు మేటిసత్యమున
ననిగెల్చి, గజపతి నామత్స్యనృపతి
ఘనమాళవులను మాగధమహీశ్వరుల
దండించి, మగధభూధవతనూభవుని
నండజపతిజవు నాసహ దేవు
మన్నించి వానిచే మఱి పూజవడిసి,
యెన్నంగ హిమగిరి కేఁగి తేజమున
నాగిరీంద్రునిచేతి ననుమతిఁ బడసి,
వేగంబె నిర్జరవిభుపర్వతమున
బహుకిరాతావళీపతుల నేడ్వురను
సహజశౌర్యుల [2]నుదంచజ్జయాధికుల
ధర్మయుక్తులను సుధర్మధార్మికుల
నర్మిలిఁ జంద్ర సేనాధీశ్వరులను
మురహరహితుల సముద్ర సేనులను
వరవిక్రములఁ గర్ణవత్సపతులను
వైరి [3]భంజన పౌండ్రవాసుదేవులను
గౌరవంబున [4]వశంకరులుగాఁజేసి
ధరణీశ్వరులగెల్చి ధనము రత్నములు
గురుతరంబగుశతతోటి సంఖ్యములు

  1. మేదినీశునిపార్శ్వమేటిసత్వమున.
  2. నుదంజభవకౌశుకులను.
  3. జంభన.
  4. వశీకరులు. (మూ)