పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

531


రాజు ధర్మజుఁడు సంరంభంబుతోడ
రాజసూయమహాధ్వరంబొనర్చెడిని;
అరివెట్టునీ.” వన్న నఖిలహేమములు
వరరత్నములు గజవాజియూధములు
నిచ్చినఁ గొని భక్తినిట్లనిపలికె:
“మచ్చిక ధర్మజు మఖమున కీవు
రమ్ము వేగమున వీరశ్రేష్ఠ!" యనుచు
నిమ్ములఁ దమభూమి కేఁగె శౌర్యమున ,

భీముని పూర్వదిగ్విజయము



చతురంగబలములసంఖ్యలుగొలువ
బ్రతిపక్షులను గెల్చి, పవననందనుఁడు
నానార్థములుగొని నడచి ముందటను
బూని కులూత భూభుజు బృహద్బలుని
గెలిచి, యుత్తరభూమికిని జని యందుఁ
దెలివితోడను వామదేవ గౌతముల
వసునామములుగల వనుధేశ్వరులను
బొసఁగఁగ గెలిచి, యాపూర్వదిక్కునకు
జని భక్తిఁ బాంచాలచక్రేశుచేతఁ
గనకాంబరంబులు గాంచి, విదేహ
రాజు జయించి, ఘోరదశార్ణవిభుని
యాజి [1]సుధన్వుని యతిశౌర్యమునకు
వెసమెచ్చి తన సైన్యవిభునిఁగాఁ జేసి,
యసమానయశుఁడైన యశ్వమేధేశుఁ
డగురోచమానుని ననుజయుక్తముగ
మగఁటిమి గెలిచి, సమ్మదచిత్తమునను

  1. సుధర్ముని (మూ) సుధన్వుఁడని నన్నయ. అధిసేనాపతం చక్రే సునర్మాణం
    మహాబలం. అని వ్యాస. భా.