పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

530

ద్విపద భారతము.


క్రమ్మఱ పూర్వభాగమున కేతెంచి
సమ్మదమ్మున బాహుసత్వుఁడై మెఱసి
వరపుళిందావనీశ్వరు నోర్చి పేర్చి,
దురములోఁ బ్రతివింధ్యుఁ ద్రుళ్లడఁగించి,
సకలమహాద్వీప జగదీశ్వరులను
బ్రకటంబుగా గెల్చి పౌరుషంబునను,
రాజులుగొలువంగ రాజసంబునను
రాజశేఖరకృపా రమణీయుఁడగుచు
శూరతవచ్చెఁ బ్రాగ్జ్యోతిషంబునకు,
నారూఢిఁ దత్పట్టణాధీశుఁడైన
భగదత్తుఁడేతెంచి పార్థునితోఁడ,
దెగి రణంబొనరించెఁ దివిఱిపోనీడ .
ఎనిమిదిదివసంబు లెదిరి పోరాడి
యనిమిషేంద్రకుమారు నఖిలాస్త్రములను
వడి భగ్నమగుచుఁ గవ్వడికి నిట్లనియె:
"నెడపనికడఁకతో నేనింద్రసఖుఁడ;
నీవింద్రసుతుఁడవు; నీకును నాకు
వావిరిఁబగలేదు; వలసినర్థముల
నడుగుమిచ్చెద." నన్న నతఁడాహవంబు
తడవక [1]కార్యసంధానుఁడై మించి
భగదత్తు సంతతప్రముదితచిత్తు
. . . . . . . . . . . . . .
బాహాబలోద్వృత్తు బహుదానవృత్తు
నాహవస్వాయత్తు నతిపుణ్యసత్తుఁ
గని వానికినిభక్తిగలిగి యిట్లనియె:
" ననఘాత్మకుఁడు భరతాన్వయుండైన

  1. కార్యవాదియని కవియూహగాఁబోలు !