పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

529


అంతట ధర్మజుఁ డనిలజుకనియె:
'నెంతయుఁఁడఁగ మీరెల్ల సైన్యములు
సేవింపఁ బూర్వదక్షిణపశ్చిమముల
కా [1]యుత్తరంబున కరిగి రాజులను
గెలిచి కప్పంబులఁ గీర్తితో గొనుచు
బలిమినేతెం'డని పనుప నాక్షణమె
నాల్గువారధులపై నడచెడి క్రొత్త
నాల్గువారిధులట్లు నలుగురు గదలి
చనిరి వా." రనవుడు జనమేజయుండు
జననుతుఁడైన వైశంపాయనునకు :
"నే దేశమునకు వారేగిరి? ధనము
లేదేసఁ దెచ్చిరి? యెఱిఁగింపు.” మనినఁ
జతురాత్ముఁడైన వైశంపాయనుండు
మతి జనమేజయక్ష్మానాథుకనియె:

విజయు నుత్తరదిగ్విజయము

"వర్ణనకెక్కు పావకదత్తమైన
స్వర్ణదివ్యరథంబు జయముతో నెక్కి,
...............................
...............................
మత్తశాత్రవరాజమణుల మర్డించి,
యుత్తరభూమికి నురువడి నేఁగి
రణరంగమున నుమారమణునిఁ బ్రమథ
గణముల గెలిచి, భీకరశౌర్యమునను
ధనదునోడించి యర్థముచాలఁగొనుచు,
ననిమిషేశ్వరునిచే హాటకంబంది,

  1. వుత్తరంబున (మూ) వ్యావహారికోచ్చారణననుసరించి కవియీపదమును వకారాదిగాఁ బ్రయోగించియుండును.