పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

527


పొదివిచ్చె; వానివిస్ఫుటకళేబరము
విదితంబుగా రాజవిపులసద్గృహము
తోరణాం[1]తరమునఁ దొడరివేయుటయు,
నారూఢి సూర్యోదయంబయ్యె నంత,
గరుడధ్వజుండు సత్కరుణ మాగధుల
నరుదారరక్షించె నభయంబు వేఁడ.
ఆగిరివ్రజమున నటుచెఱనున్న
సాగరవేష్టితక్ష్మాతలేశ్వరుల
విడిచి, జరాసంధవిభుతనూభవుని
నుడురాజనిభుని నత్యుత్తమోత్తముని
నాసహదేవుఁ గృపార్ద్రచిత్తమున
భాసురయుక్తితో బట్టంబుగట్టి
...............................
...............................
" ఆజరాసంధు మహాదివ్యరథము
భ్రాజితనవరత్నరాజి నొప్పారు;
నాయింద్రుఁడును దాని నర్ధిఁబ్రార్ధింపఁ
బాయక వసువను పార్థివుకిచ్చె;
నావసువొసగె జయద్రథునకును;
ఆవసుధేశుండు నట జరాసంధ
విభునకునిచ్చెను వేడుక దీనిఁ.
ద్రిభువన స్తుతమైన దివ్యరథంబు
మనమెక్కిపోదము మానుషంబునను."
అని విహగేంద్రుని హరిదలంచినను,
అతఁడేగుదెంచిన నారథంబునకు
జతనంబుతోడను సారథిఁ చేసి

  1. తంబున (మూ)