పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

525


మొదలుగా నుద్దండముష్టిఘట్టనలఁ
బదివేలభంగులఁ బ్రధనంబుచేసె,
పడిఁ ద్రయోదశినాఁడు పరసత్వములను
బెడిదంబుగాఁబోరి పెనఁగి, వెండియును
ఆచతుర్దశినాఁటియర్ధ రాత్రమున
వైచిత్రి మగధభూవరుఁడలసినను,
ఆవేళ భీమున కచ్యుతుండనియె :
"లావుదొలంగెఁ జాలఁగమాగధుండు ;
పవమానుబలిమి నీపటుభుజాబలిమి
బవరంబులో వీనిభంజింపు." మనిన
ననిలసుతుండు నయ్యనిలునిఁ దలఁచి
ఘనసత్వుఁడై బాహుగర్వంబునందు
నాజరాసంధుని నాజిరంగముస
గాజువాఱఁగఁజేసి, కడువడిఁబట్టి
ముక్కున వాతను మొగిఁ జాలరక్త
మొక్కటియైకాఱ నొగినూఱుమాఱ్లు
విసరి నేలనువైచి, వెస వానితనువు
కొసరక [1]చీల్చి గ్రక్కున రెండుకడలఁ
బాఱవైచుటయు, నపారవైచిత్రి-
తో రయంబునను దోడ్తోన నారెండు
బద్దలప్పుడు నెడఁబాయకందఱును
'అద్దిరా ! వీనినే ' ర్పని కొనియాడ
నంటేర్పడకయుండ నంటిన, లేచి
తొంటియట్లనె వాఁడు దురముననెదిరె.
అదిగని భీముఁడత్యాశ్చర్యమంది
కదిసి కన్నుల నగ్నికణములుదొరఁగ,

  1. నిలిచి. (మూ)