పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

517


[1]యణఁపఁగ హంసుని నాడిచికునిని
గణుతి కెక్కిన కార్యకర్తలుగాఁగఁ
జేకొని యరులనిర్జింపుచునుండు;
నాకాలుపురికిని హంసుండు డిచికుఁ
డరిగినపిమ్మట, నతిగర్వముడిగి
సరవినిప్పుడు జరాసంధుఁడున్నాఁడు [2].
ఏయాయుధంబుల నీల్గకుండుగ
నాయిందుధరునిచే నటువరంబందెఁ;
గావున, వానినిఁ గ్రమముతోడుతను
బావనిచే నణంపఁగఁజేయవలయు;
మల్లయుద్ధంబున మానుషంబునను
దెల్లమిగాను వర్తింపఁగవలయుఁ;
బవమానతనయుని బాహాబలమును
దివిజేంద్రనందను దివ్యాస్త్రబలిమి
నాకీర్తిబలమునున్నతి సహాయముగ
నీకసాధ్యంబెద్ది నిఖలలోకముల!
నాకునిల్లడయిమ్ము నరుని భీమునిని
జేకొని మగధునిర్జించెద." ననిన :
హరి భీము నర్జునునప్పుడు చూచి
సరసిజూక్షునితోడ శమనజుండనియె:
"నీ సహాయముగల్గ నిఖిలశాత్రవుల
వేసమయంబున విజయవాయుజులు
విదలించి త్రుంతురు వివిధభంగులను;
దుది రాజసూయంబు దొరయ సిద్ధించు;
నీకృపగలుగంగ నిఖిలార్థవితతి
గైకొనరానివి గలవె లోకముల!

  1. నడంగను (మూ)
  2. నిజసంక్షయశంకితాత్ముఁడై అను విషయ ముధ్యాహార్యము