పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

511


రక్షించి సత్కీర్తిరమణిఁ గైకొనిన
నక్షయసుకృతంబు లనిశంబుఁ గలుగు."
ననిపల్క భీముని యాపార్థుమాట
విని కృష్ణుఁడప్పుడు వేడ్కనిట్లనియె:
"శౌర్యంబు గలిగినజగదీశ్వరులకుఁ
గార్యంబులివి వివేకమునఁ జింతింపఁ;
గాన మువ్వురమును ఘను జరాసంధుఁ
బూని వాహినిదరిభూజంబు మొదలు
పెకలించు కైవడిఁ బేర్చి త్రుంచెదము;
అకలంక మతిఁజని యాదురాత్మకుని
నంతరంబెఱుఁగనియట్టిదుర్మదుని
హంతను సర్వలోకాపకారకునిఁ
జంపుద." మనవుడు సంతోషమంది
తెంపుతో హరికి యుధిష్ఠిరుండనియె:
" నీకోవవహ్నిలో నెఱయంగ మిడుత
యై కడువడిఁబడు నామాగధుండు.
అనఘ, శూరుండైన యాజరాసంధు
జననంబు నాకును సర్వంబుఁ దెలువు"
మనియడిగినయట్టి యమతనూజునకు
వనజూత నేత్రుండు వర [1]భక్తిఁబలికె :

జరాసంధు నుత్పత్తికథనము

"మగధ దేశంబేలు మానవేశ్వరుఁడు
అగణితశక్తి బృహద్రథుండొప్పు;
నక్షౌహిణిత్రితయంబైనసేన
దాక్షిణ్యమునఁ గొల్వఁదగనున్నవాఁడు

  1. భక్తి పదము ప్రేమవాత్సల్యపర్యాయముగా నిందుఁ గాననగును.