పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

506

ద్విపద భారతము.


విను నీకు నెఱిఁగింతు వృత్తాంత మెల్ల;
మును జమదగ్ని రామునిచేతఁ దెగిన
[1] రాజులనుండి ధరాతలంబునను
రాజసూయాన్వయ రాజాగ్రణులకుఁ
[2] దక్కఁ దక్కినమహీధవయూధములకు
నెక్కడైనను జెల్లదిట్లు సేయంగ;
నీ రాజసూయంబు నిలఁ జేయునపుడు
వైరులులేకుండ వలయు నిచ్చటను;
ఇప్పుడు జరాసంధుఁడేచియున్నాఁడు
నృపులనుగెలిచి యున్నిద్ర శౌర్యమున;
నతనినేగూడి యీ [3]యెడఁ జేదివిభుఁడు
ప్రతిపక్షియై శిశుపాలుఁడున్నాడు;
అతిమాయలనుబెట్టు [4] హంసుండు డిచికుఁ
డతనినే సేవించి యర్థినున్నారు;
చిత్రంబు! వారు కౌశిక చిత్రసేన
పాత్రనామంబులఁ బరఁగినవారు;
బహుసేనలను గూడి పస జరాసంధుఁ
సహితులై సాధనసన్నద్ధులగుచు
వర్తింపుచున్నారు వారు మువ్వురును.
స్ఫూర్తితో వరుణునిభుజశక్తి గలిగి
భగదత్తుఁడను రాజు పశ్చిమభూమి
మగఁటిమి నేలుచు, మఱి జరాసంధుఁ
బొదివియున్నాఁడు భూభువనమెఱుంగ.
పదిలమై యాచేదిపతులలోపలను

  1. మూలమును అవ్యక్తముగా ననుకరించినాఁడు. చూ, నన్నయ. సభా . ప్ర. ఆ.110.గ.
  2. అమూలకము
  3. ఆయెడ ఈయెడ మొ. పదములను వ్యవహారమందలి ఉచ్చారణచేఁగలిగిన భ్రాంతివలన, అకారమధ్యములుగా ప్రయోగించి నాఁడు. తిమ్మయ రచనయగు ఆదిపర్వములోఁగూడ నట్టివి గలవు.
  4. హంసడిభకులు. -అని నన్నయ, సభా, ప. డిచికుఅనియు, పా , అం, ఇందంతట డిచికులనియేగలదు.