పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

503


వినుపించి, త్రిభువనవిఖ్యాతముగను
మన రాజసూయమఖంబు గావింపు. "
మనfపూని పుత్తెంచె; నదిగాన, మీర
లనుపమరాజసూయాధ్వరంబొప్ప
జేయుఁడు; పాండుసృష్టితలేశ్వరుఁడు
వేయికన్నులవానివీటనే యుండుఁ;
గావున నీ పరాక్రమసహోదరుల
లావునఁ జేసి చాలఁగ రాజసూయ
యాగంబు గావించి, యఖిలార్థములును
ఆగమోక్తులను బ్రాహ్మణులకు నిచ్చి
జనులఁబాలించిన, శక్రునిపురము
గొనకొని గలుగు మీగురుఁడుపాండునకు.
ఇందుకు విఘ్నంబు లెన్నేనిగలవు;
అందుకు వెఱపకుండది మీకు జయము."
అని చెప్పి నారదుండరిగె నాక్షణమ.
యనఘుండు ధర్మజుండంతఁ దమ్ములను
ధౌమ్య వేదవ్యాస ధరణీసురేంద్ర
[1]సౌమ్య సజ్జన సమక్షమ్మునఁబలికె :

రాజసూయ సంకల్పము

"గణుతింపఁ దసయుడు గలిగినఫలము
క్షణములోపలఁ బితృజనులకోరికలు
తీర్చఁగల్గుటయె యీత్రిజగంబు లెఱుఁగఁ;
బేర్చినారదుఁడు చెప్పెనుసకలంబు.
రాజనూయమహాధ్వరంబు చేసినను
దేజంబుతోఁ బితృదేవతలెల్ల

  1. స్వామ్య......క్షమమున (మూ)