పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

501


బోయిచూచితి దానిఁ [1]బొగడిచెప్పంగఁ
దోయజానన ఫణీంద్రులకశక్యంబు.
అందు బ్రహ్మనుగొల్చి యాదిమనువులు,
బృందారకులును, నత్రియు, మరీచియును,
భృగు భరద్వాజ శోభితవశిష్ఠులును,
దగువాలఖిల్య కశ్యప గౌతములును, (?)
బుణ్యకణ్వ పులస్త్య పులహ కుంభజులుఁ,
గణ్యులాంగీరస కమలాసనులును,
జంద్ర సూర్య గ్రహసముదయంబులును,
సాంద్ర తారకములు, సద్గుణాకరులు
వసు రుద్ర సిద్ధ పావనసాధ్యవరులు,
విశదవిశ్వేదేవ విశ్వంబు, నధిక
గౌరవ ధర్మార్థ కామమోక్షములుఁ,
బారీణమైన శబ్దస్పర్శరూప
రసగంధములు, [2] దపశ్శమదమంబులును, (?)
పసిమి [3] సంకల్ప(వి)కల్పప్రణవములు,
సమధికక్షణములు, సన్ముహూర్తములు,
రమణీయమగు నహోరాత్రపక్షములు,
సంచితమాసార్ధసంవత్సరములు,
నంచితారూఢయుగాత్మకంబైన
కాలచక్రంబును, ఘనకరణములుఁ
జాలఁజతుర్వేదశాస్త్రవిద్యలును
మూర్తిమంతంబులై ముదమునఁగొలువఁ,
గీర్తిశోభిల్ల వాగ్దేవితోఁ గూడి

  1. బొగడుచుండంగ
  2. మదరాక్షసేశ్వరులు (మూ ) మదరాక్షసేశ్వరులు బ్రహ్మసభలో నున్నట్లెందును లేకపోవుటచేతను, 'రూపరసగంధము' అని నన్నయ భారతములో నుండుటవలనను పైవిధముగా సవరింపఁబడెను. యతిభంగ మీతని సంప్రదాయమే.
  3. సంకల్పవికల్ప ప్రణవములని, నన్నయ.