పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

497


నారదసన్ముని నాథున కనియె:
“నారయ దోషంబులన్నియు మాని,
న్యాయంబుతప్పని నడవడి గలిగి,
పాయని ధర్మసంపదఁ జరింపుదును."
అనిమ్రొక్కి భక్తితో నప్పుడిట్లనియె :
"మునిచంద్ర, బహులోకములుచూడనివియు
నేవియుఁగలవు మీయిచ్చఁజింతింప!
సౌవర్ణమయమైన సకలచిత్రముల
యీసభఁజూచితే! యిప్పు." డటంచు
వాసియెలర్ప సర్వంబుఁజూపినను
జూచి యమ్ముని ధర్మసూనునకనియె:
"భూచక్రమునను నవూర్వమియ్యదియు!

ఇంద్రసభా వర్ణనము

నీసభఁబోలంగ నేసభ లేదు;
వాసవుసభ హేమ వరరత్న చిత్ర
మయమునై శోభిల్లు; మఱి దానిఁబొగడ
నయశాలియగు శేషునకు నశక్యంబు,
అది శతయోజనంబగు వెడల్పునను,
బదిలమై నూటయేఁబది యోజనముల
నిడువు, నవ్వలఁబంచనిజయోజనముల
[1]పొడవును గలిగి పెంపును దీప్తి గలిగి
ఘనతరంబగు కామగమనంబు గలిగి
యనుపమ ఫలనివహారామములను
వరుసతో వరరమ్య వైభవంబగుచు
గురుతపఃప్రౌఢిచేఁ గొమరుదీపించు.
నమరేంద్రనిర్మితంబైన యాసభను
అమరేంద్రుఁ డతిభూతి నమరగంధర్వ

  1. ఉన్నతి, అను నర్థములో వాడియుండును. 'తనర్పు' అని, నన్నయ.