పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

489


నారాయణుండు పాండవుల వీడ్కొనుచు
ద్వారావతికినేఁగెఁ దత్ క్షణంబునను.
మయుఁడు పూర్వోత్తరమార్గంబులందు
రయముననేఁగి తారానగాగ్రమున
కుత్తరదిశను నత్యుత్తమంబైన
సత్తగు మైనాకశైలంబునందుఁ
గనకశృంగము గాంచి ఘనతనిట్లనియె:
“మనసిజారాతి సమస్తలక్ష్ములను
సచరాచరంబైన జగములనెల్లఁ
బ్రచురంబుగా సృజింపఁగఁబూనె నొక్కొ!
గంగ ప్రత్యక్షంబుగాఁబూని మున్ను
[1]ఆంగికుండైన మహాభగీరథుఁడు
తపమిందుఁజేసెనో తర్కించిచూడఁ !
ద్రిపురహరధ్యాన ధీమంతులైన
నరునకు శ్రీకృష్ణునకు నివాసంబు
కరమర్థినయ్యెనో గౌరవంబునను ;
సుర యక్ష సన్ముని స్తోమంబు క్రతువు
లరుదారఁజేయు నయ్యావాసమొక్కొ !"
యని చిత్రములుగల్గి యమితయూపములఁ
బెను [2]పొందుచున్నట్టి బిందుసరమునఁ
గమనీయ రత్నోపకరణచయంబు
క్రమమొప్పఁ గైకొని, ఘనవిప్రతతుల
నారాధనముచేసి, యతినిశ్చయమునఁ
జారుతరంబైన సభ సృజియింప
నవకమైనట్టి రత్నపుదూలములను
వివిధమణిస్తంభ [3]విసరణంబులను

  1. ఈపదమును పదింపదిగావాడుచుండును ; ఆర్థమూహ్యము.
  2. పొందనున్నట్టి లింబొదరమున.
  3. విసరంబులందు. (మూ)