పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

482

ద్విపద భారతము


మనుచు గౌరీశ్వరుఁ డమరనాథునకుఁ
దసరంగ వరమిచ్చి తద్దమోదమున,
వినుతులు సేయు గోవిందఫల్గుణుల
(నొనర వీ)డ్కొని, సురయూధంబు గొల్వ
సకలమునీంద్రులు సన్నుతిసేయ
నకలంకగతి నేఁగె నాలయంబునకు.
వనజజుఁ డాదిగా వరముల నొసగి
చనిరంతఁ దమ నిజస్థానంబులకును.

ఇంద్రుఁడర్జునునకు దివ్యాస్త్రములొసగుట


అంత దేవేంద్రుండు నాత్మజుమీఁద
నెంతయువేడ్క ననేకబాణములు
నరున కర్మిలి నిచ్చి, నారాయణునకు
నురుహార మకుట కేయూరంబు లిచ్చి,
మమత [1]వీడ్కొనిపోవ, మయుఁగూడి ధరణి
రమణులు వచ్చి రింద్రప్రస్థవురికి,
హరిచేఁ గిరీట మిట్లందుటఁజేసి
నరున కబ్బెఁ గిరీటినామధేయంబు.
ఇదియాదిపర్వంబు హితరాజసభల
విదితమై వర్ధిల్లు విద్వాంసు లలర.
అని యిట్లు జనమేజయ క్షితిపతికి
ముని మున్నుచెప్పినముఖ్యమార్గమున
నక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథ వినుపింప హర్షించి వారు
ఆతనిఁబూజించి యనఘులుమునులు
ఆతరువాతి వృత్తాంత మేమనిన,
 

  1. చేకొని (మూ )