పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

480

ద్విపద భారతము


నప్పుడు శ్రీకృష్ణుఁ డమరేంద్రసుతుఁడు
నుప్పొంగి సన్నుతు లోలిఁగావించి,
[1] పొనరఁ గరాంబుజములు భక్తిమోడ్చి
వినయవినమ్రులై వినుతించి రిట్లు :
"శర్వ, సర్వేశ్వర, శాంభవీరమణ,
సర్వజ్ఞ, సర్వాత, సచ్చిదానంద,
నిర్వికల్పకభావ, నిగమాంతవేద్య,
నిర్వికార, నిరీహ, నిర్వాణగమ్య,
గజదైత్యసంహార, గజచర్మధార,
గజరక్షసన్నుత, గజవక్త్రజనక,
నిన్నెఱుంగఁగ లేవు నిఖలవేదములు;
నిన్ను గానఁగ లేవు నిఖలశాస్త్రములు;
నేమెంతవారము నీతత్త్వమెఱుఁగ;
సోమార్ధశేఖర, సురుచిర తేజ! ”
అనుచు నివ్విధమున హరియు నర్జునుఁడు
వినుతులుసేయంగ విశ్వేశుఁ డలరి
చిఱునవ్వు దళుకొత్తఁ జెలఁగి యిట్లనియె:
.......................................
జలజాక్ష, నీతోడ సఖ్యంబుగలుగఁ
జెలఁగి పూజ్యుఁడనైతి సకలలోకముల;
కమలాక్షు, నన్నాదికాలంబునందు
భ్రమరకీటన్యాయపద్ధతి వేడ్క
నీవు ప్రతిష్ఠింప నిత్యుండనైతి;
నీవుసంకల్పింప నెఱిఁ దృణంబైన
నావేల్పుశైలమౌ నఖిలలోకేశ!
.........................................
.........................................

  1. యొనరకరంబుల భక్తియుమోడి (మూ)1