పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

476

ద్విపద భారతము


సుర యక్ష కిన్న రాసుర సిద్ధ సాధ్య
గరుడ గంధర్వ వర్గము నగ్నిమీఁద
ననిచినఁ, గాండీవి యాసేననెల్ల
ననిచిన దివ్యబాణప్రభావమున
మంత్రభస్మము భూతమండలిమీఁద
మాంత్రికుండొదవించి మఱి విప్పునట్లు
తఱిమిన, నిలువక దైవతసేన
పఱచె నిప్పులుచల్లి పావకుండార్వ.
అంతఁ దక్షకసూనుఁ డశ్వసేనాఖ్యుఁ
డెంతయు భయముతో నెలదోఁటనుండి
తనతోఁక గఱపించి తల్లిఁదోకొనుచు
వినువీథి కెగసిన, వీక్షించి నరుఁడు
వాలమ్ముచే వానివాలమ్ము తల్లి
తో లీల నగ్నిలో దొరఁగ ఖండించి
మఱి వానినేయుచో, మఘవుండు మాయ
మెఱయించి విడిపించె [1]మిత్రనందనుని.
విను మంత నప్పాము వెసఁబోయి కర్ణు
దొనఁజొచ్చి యర్జునుతోడివైరమున :
"నరునిఁ జంపెదఁ గర్ణ, నన్నాజిఁ దొడుగు,
మిరవైనగతి నమ్ము నే నీకు నమ్ము,
హరిహరబ్రహ్మాదు లడ్డమైరేని
మరలఁజుమీ! చంపె మాతల్లి నఁతఁడు."
అనుటయు, ధూపదీపాదుల నతని
నొనరఁ బూజింపుచునుండెఁ గర్ణుండు.
ఇట ఱాలవాన నయ్యింద్రుండు గురియఁ,
బటులీల నగ్నిపైఁ బడకుండ నరుఁడు

  1. మంత్రి (మూ)