పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

474

ద్విపద భారతము


నాకార్యమునకు యత్నముసేయువీరి
కీకలాపములేక యేదియుఁగాదు.”
అనిన నన్నియుఁ దెచ్చి యతఁడిచ్చిపోవ ,
ననువుతో నరుఁడు నారాయణుఁజూచి :

ఖాం డ వ ద హ న ము


"యేరథికుండనయ్యెద ; నిందునీవు
సౌరథ్య మొనరింపు సత్కృప." ననుచు
లాలిత సింహగోలాంగూల కేతు-
ఖేలన ధవళాశ్వ కీలితరథము
నాయుధసన్నద్ధులై వేడ్క నెక్కి,
యాయగ్ని వెఱవకుమని యూఱడించి,
ఖాండవవనవీధిఁ గాల్పఁబుచ్చుటయు,
నొండొండ దరికొని యుగ్రుడై వహ్ని
నాకంబుపొడవుగా నాల్కలువాఱ
భీకరధ్వనితోడఁ బేర్చి కాల్పంగఁ,
దెరువులులేక మ్రందెడుమృగంబులును,
సరసరఁజనలేక స్రగ్గుపక్షులును,
[1]మలఁగుచోటును లేక మ్రగ్గుసర్పములు,
గలఁగిమడువులలోనఁ గందుమత్స్యములు,
మిడుఁగుఱుఁగాడ్పున మృతిఁబొందుకపులు,
నడవిఁగ్రమ్మిన మంటనణఁగెడు తరులు,
నిగుడు పువ్వులతోన నీఱైనలతలుఁ,
బొడవుగా దరికొనుపొదరిండ్లుఁ గలిగి
వెనుకొని మిన్నేఱువేఁడిగా మంట
వనమువెంటనె పర్వ, వనపాలురార్చి

  1. మలంగజాటున. (మూ )