పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

462

ద్విపద భారతము


దేవపూజకుఁబెట్టి, దేవసన్నిధిని
బావుమీఱిన పత్రపాత్రంబువెట్టి,
మెత్తనియశనంబు మేల్మిపాయసముఁ
గ్రొత్తగాఁ గాచిన గోవులునేయి
గారెలు బూరెలుఁ గడియపుటట్లు
నీరొత్తు [1]లౌజులు నెఱయుమండిగలు
ఫలములుఁ గూరలుఁ బంచదారలును
ఒలుపుఁబప్పును దీపునొట్రువడియములు
వరుగు లప్పడములు వాసితోదకముఁ
జిఱుచెట్టు తేనియ చెలువైనకంద
పెరుగులుఁ బచ్చళ్లు భీమానుజునకు
సరసవడ్డించి, భోజమైనపిదపఁ
గిన్నరకంఠి యెంగిలి [2]పాఱఁబోసి,
పన్నీట నడుగులు భక్తితోఁగడిగి,
కమ్మఁగాఁ దనువునఁ గప్పురంబార్చి
యిమ్ములఁజనుచోట, నిటనొక్కనాఁడు
హరిసూనుఁ డాయింతి యధరపల్లవము,
నరచందురునిచందమందిననుదురుఁ,
గనుఁగవ చిక్కులు గరమూలయుగముఁ
జన్నులు నడుమును జఘనభారంబుఁ,
గ్రన్ననఁ బాదపంకజములు వేడ్కఁ
జూచి యచ్చెరువంద, సురరాజసుతునిఁ
జూచి యిట్లనియె నాసుదతీలలామ :
"ఎప్పుడు నోయయ్య! యేయూరు మీకు?
నిప్పు డెచ్చోటికి నేఁగుచున్నారు?
వెస మీరుచూడని విశ్వంబు లేదు;
పొసఁగ నింద్రప్రస్థపురము చూచితిరె!

  1. లేగులు
  2. యార్వంబోసి (మూ)