పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

461


సుభద్ర అర్జును నుపచరించుట


కురియుచో, నప్పుడు గోవిందుననుజ్ఞ
పరిచర్యకై వచ్చి పార్థునిఁగదిసి,
పరమేశ్వరుండు తపంబాచరింపఁ
బరిచర్యకైవచ్చు పార్వతివోలె
మంచిగంధంబున మంటపంబలికి,
మించిన కెంబట్టుమేల్కట్టు కట్టి,
మొగ్గలవలెఁ దీర్చి మ్రుగ్గులువెట్టి,
గుగ్గులు[1]ధూపంబు ఘూర్ణిల్లఁజేసి,
సరసముగాఁబెట్టి జమ్ముఖానంబు,
ధరఁ బులితోలుతాఁ దార్కొనఁబఱచి,
కప్పారునీలాల కాళులవీట
చప్పరంబునఁ బెట్టి జలకంబులార్చి,
నెఱిఁ బట్టియుదికిననీర్కావిగోచి
నెఱయ నీళ్లాడిన నృపతికినిచ్చి,
కాషాయవస్త్రంబు కస్తూరినద్ది
వేషధారికిఁ దెచ్చి వెన్నునఁగప్పి,
పవడపుఁబిల్లనపావాలు పెట్టి,
యివురాకుఁగైదండయిచ్చి తోడ్తెచ్చి,
కుంకుమమెత్తిన కూర్మిపీఠంబు
పంకజాననవెట్టి, భక్తితో మఱియు
నాపైనఁదులసియు నక్షమాలికయు
గోపిచందనమును గుశపవిత్రమును
సరసరీతులనిచ్చి, [2]జపమైనదాక
నొరసిలియుండి తానొయ్యనవచ్చి

  1. ధూమంబు
  2. జడ (మూ)