పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

454

ద్విపద భారతము


నర్జునుం డాగ్రాహి పదరంటఁదన్ని
భర్జించి చేపట్టి రోషాయస్ఫూర్తి
వెలిఁబాఱవైచిన వేగంబె యదియు
వెలఁదియై నరుఁజూచి వేడ్క నిట్లనియె:
"ఓరాజ, నీకృపాయోగంబువలన
నీరీతి [1] నాశాప మింతయునుదీఱె
తరువాతి సరసులన్ తరుణులు నల్వు
రొరలుచునున్నవా; రొప్పుగా వారి
శాపముక్తులఁ జేసి స్నానఫలంబు
చేపట్టవే! వారు చెలియండ్రు నాకు.
పోయెద ధననాథుపురమున కేను ;
నీయభీష్టములెల్ల నెలకొనుఁగాత"
అనిన బీభత్సుండు నతివకిట్లనియె:
"వనిత, మీకేటికి వచ్చెశాపంబు?
మీనాథుఁ డెవ్వాడు మీదుఁ బేరేమి?
పూని చెప్పు." మటన్న బొలఁతియిట్లనియె:
"వినుతాత్మ, వినుము మావృత్తాంతమెల్ల ;
నొనరఁ గుబేరుని యుడిగల మేము;
[2]నా పేరునందయౌ; నాసఖుల్ లతయు
రూపింప [3]సౌరుచి రూఢిసమీచి
యరయ [4]బుద్బుద యనునట్టియేవురముఁ
బరఁగ సుఖంబుండి, బహుకాలమచట
నొకనాఁడు వేడ్కమై నొనరలోకంబు
లకలంకగతిఁ జూతమంచు నేతెంచి,
సకలలోకంబులు జరియించి చూచి,
ప్రకటభూలోకంబుఁ బరికించుచోట,

  1. నాతాప
  2. నా పేరునంద యానావెన్క లలిత. (మూ) వంద అని నన్నయ. వర్గ అని వ్యాస. భా.
  3. సౌరభేయి, అని సం. ఆం. భారతములు.
  4. పుల్వస (మూ)