పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

452

ద్విపద భారతము


అర్జునుఁడు చిత్రాంగదను వివాహమగుట


"[1]వసుధేశ, తొల్లి యీవంశసూత్రంబు
పసతోడఁ దెల్పెదఁ బరిపాటి; నొకఁడు
హరునకుఁదపమున్న, నాతండు మెచ్చి
యరుదెంచి మా తాతనప్పుడు వలికె:
'కులమునిదెల్పెదను; నీకోరెడు కొడుకు
నిలువఁడు గదుర మున్నిటిదోషమునను (?)
అట్టయ్యు, వరము నన్నిడిగితిగానఁ
బుట్టుదు రొక్కొక్కపుత్త్రుఁడై యిందు;
శాఖోపశాఖలై జరుగుదుసువ్వె!
యాఖేదమునుమాని యరుగుము నీవు.”
అనియిచ్చిపోయినాఁ డట్టివంశమున
(జనియించినట్టి యీ సకియఁ బెండ్లాడి
పుత్త్రదాన మొనర్పు భూవర!" యనిన)
ధాత్రీశుఁడయ్యింతిఁదగిలెడుకాంక్ష
నొడఁబడఁగైకొని యొకకొన్నినెలలు
పడతితోడ విహారపరిణతి నుండి,
బభ్రువాహనుఁడనుపట్టిఁ బుట్టించి,
సుభ్రుతండ్రికి వాని సుతునిఁగానిచ్చి,
యచ్చోటువీడ్కొని యటపోయిపోయి,
క్రచ్చఱ సౌభద్రకంబనుకొలన
నారయఁ బౌలోమయనియెడు కొలన
[2]గారంధమఖ్యాతి గలిగిడి కొలన
నమర భరద్వాజమనియెడు కొలన
నమరు లెన్నఁ బ్రసన్నయనియెడుకొలనఁ

  1. ఈపంక్తులలోని కథాసందర్భవాక్యయోజనాదికము స్పష్టముగా లేదు; కవిత్రయ
    భారతమునుబట్టి సవరింపఁబూనినచో జాల తాఱుమాఱు చేయవలసివచ్చునని ఇట్లే యుంచబడినది.
  2. కారండవిఖ్యాతి (మూ)