పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

444

ద్విపద భారతము


వెదకి గోచోరుల విపినమధ్యమునఁ
జెదరిపోనీక నిర్జించి, యాపశుల
మరలించి తెచ్చి బ్రాహ్మణునకునొసగి,
వరరత్నకాంచనావలిఁ బూజచేసి,
యతనివీడ్కొల్పి యభ్యంతరంబునకు
నతివేగమునఁబోయి యమసూతిఁగాంచి,
తక్కక సాష్టాంగదండపాతముగ
మ్రొక్కి హస్తంబులుమోడ్చి యిట్లనియె:
"అనఘాత్మ, విప్రకార్యార్థినై యేను
 జనుదెంచుచో, నస్త్రశాలలోపలను
సతియు మీరును నొక్కశయ్యపై నుండ
మతిలేక గనుఁగొంటి మర్యాద దప్పి;
కావున, నొకయేడు ఘనతీర్థయాత్ర
గావింపకుండినఁ గార్యంబుగాదు
మనలోన మర్యాదమానిన, మనల
మనుజులు మనముల మఱిపాటిగొనరు.
మెలఁతద్రౌపదిఁగంటి మీరున్నశయ్యఁ;
గలదె! యీదుష్కీర్తి [1]కంటే వేఱొకటి.
అనవుడు, ధర్మరా జర్జునుఁబలికెఁ  :
"బనివడి నిన్ను నేఁబాయనోపుదునె!
నర, నీకు [2]వంత యెన్నఁడులేనివింత!
మరియాదయే యింత! మానుమీచింత!
అవనీసురార్థమై యయిన పనికి
వివరింపనున్నదే! వీరాగ్రగణ్య!
అధికధర్మార్థమై యల్పదోషంబు
బుధుఁడాచరించిన భువి నిందపడఁడు."

  1. గలవె
  2. వెంత (మూ)