పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

443


అచ్చోట బ్రాహ్మణుండడవిలోపలను
మ్రుచ్చులఁగోపించి మొఱవెట్టుకొనుచు
నతివేగమునవచ్చి యాస్థానవేది
శతమఖసుతుఁగాంచి చాల దైన్యమున :
"మేదినీపతులార, మీరలూరేల
వేదంబులనుగాని వినము మ్రుచ్చులను,
రవిగాని పరతాపరతులెందు లేరు;
దివిఁగాని పుట్టదు ద్విజపగోగ్రహణ;
మిట్టిచో, మ్రుచ్చులు హెచ్చి నాపశులఁ
బట్టినఁ, బరితాపభయుఁడనై యేను
గూయిడవచ్చితిఁ; గూడఁగాఁ బాఱి
నాయాలఁద్రిప్పవే! నలినరణ్యమున.
ద్విజుఁడ దరిద్రుండ విమలకుటుంబి
నజునైన విత్తంబు లడుగనివాఁడ."
అనిన 'నీగోవులనర్థితో దెత్తు'
ననుచు, బ్రాహ్మణుఁజాలనాద[1] రింపంగఁ
బవనజునకుఁ జెప్పి పార్థుండులేచి
............................................
యాయుధశాలకై యస్త్రముల్ దేరఁ
బోయి, యచ్చో ధర్మపుత్త్రుఁ బాంచాలి
నొక్కట రతిసేయుచున్న నీక్షించి,
గ్రక్కున నస్త్రముల్ గైకొనివెడలి,
కవచ శిరస్త్రాణ ఘనతనుత్రాణ
సవిశేషమూర్తియై స్యందనం బెక్కి,
చదువులుగొనిపోవు చండరాక్షసుని
వెదకు మీనాకారవిష్ణుఁడువోలె

  1. రణమున (మూ)