పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

441


ఇంద్రప్రస్థనిర్మాణము


"స్థలము మంచిదిగాదు ధర్మరాజునకుఁ ;
గులరాజధానికిఁ గొంచెమీపురము.
సురపురంబునకంటె సొంపైనపురము
విరచింపుమా నీదువిద్యాబలమునఁ;
జెలువున బ్రాహ్మసృష్టికిఁ బ్రతిసృష్టి
వలెనన్నఁ [1]ద్రుటిఁజేయువాఁడవునీవు.
ఈయూరితూర్పున నిదె రమ్యసీమ
యాయామ[2]పరిణాహ యంత్రితస్థలము."
అనిన, నింద్రప్రస్థమనియెడు పురము
కనకరత్నమయంబుగా విశ్వకర్మ
నిర్మించిపోయిన, నృపుఁడందువిడిసి,
ధర్మసహాయుఁడై ధరణియేలుచును,
బంచబాణానంద పారవశ్యమున
బాంచాలిఁ గవయునాభావంబుఁదెలిసి,
నారదాగమనంబు నారాయణుండు
ధారుణీశులకెల్లఁ దగనెఱిఁగించి :
'యతఁడేమి మీకుమర్యాద గావించె
హితమతి నడుఁ.' డని యేర్పడఁబలికి,
యాయతగతి వారలనుప ద్వారకకు
బోయెఁ; [3]బోవఁ, బురాణమునిపుంగవుండు
విరహులనేఁచిన [4]వృజినంబుపాయ
నురుశాంతి మునియయ్యెనో చంద్రుఁడనఁగఁ,
దెల్లని చల్లని దేహంబుతోడ
నల్లనవచ్చి, యేకాంతవాసమున

  1. బ్రతికించు
  2. పరిణామ
  3. బోయెం బురాణపురుషుం డన్నట్లు
  4. విజయంబు (మూ)