పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

440

ద్విపద భారతము


ఖాండవప్రస్థంబుగల; దది మీకు
నుండయోగ్యంబైన యొప్పులపురము;
ఉండుఁడు దవ్వులే దొకవాడపెట్టు;
రెండు దేశములు వర్ధిల్లు నిట్లైన.
అని చెప్పి ధర్మజుననిచి భూవిభుఁడు
గొనకొని కృప భీష్మ గురులునుతింప,
నరుణోదయంబైన యమ్మఱున్నాడు
హరిపూర్వముగ వారి నర్థిరప్పించి,
యభిషేకశాలలో నర్హపీఠమునఁ
బ్రభువైన ధర్మజుఁ బాంచాలినునిచి,
మంత్రోదకంబుల మజ్జనంబార్చి,
మంత్రి [1] సమేతుఁడై మకుటంబుపెట్టి,
పాండునిపాలికిఁ బట్టంబుగట్టి
ఖాండవప్రస్థంబు కడకు వీడ్కొల్పఁ
బాండవుల్ ధౌమ్యునిఁ బాంచాలిఁ గుంతిఁ
బుండరీకాక్షునిఁ బొసఁగఁదోడ్కొనుచుఁ,
ద్రుపదుని సైన్యంబుతో వీడుకొల్పి,
నృపతిపంచినసేన నియతిఁదోడ్కొనుచుఁ,
గురుపతి కృప భీష్మ గురు విదురులకు
నిరవొంద నందుఁబోయెదమని చెప్పి,
కరిపురిఁ బాండునికాలంబు విప్ర
వరులకిచ్చిన [2]చేలు వడినప్పగించి
యరిగినచోఁ, గృష్ణుఁ డప్పుడప్పురికిఁ
గరిపురిఁగల సొంపుగలగమి చూచి,
కరము వేగము విశ్వకర్మరావించి,
సరసత నయ్యూరిచందంబుదెలిపి,

  1. సమేతులై
  2. వేలు (మూ )