పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

435


నుతరీతిఁ బాండుసూనులఁ గౌఁగిలించి,
ధృతరాష్ట్రుఁడిచ్చిపుత్తెంచు వస్తువుల
వారికివారికి వరుసతో నొసగి,
బోరన ద్రుపదుచేఁ బూజలువడసి
పంకజనాభునిఁ బరికించి పలికె:
"ఇంకఁ బాండవులకు నేవిచారంబు!
పాంచాలుఁ డిటఁగల్గెఁ బరమ బాంధవుఁడు;
వంచింప నికరాదు వారి వైరులకుఁ;
దలఁపులో నదిగాక తరలవునీవు;
కలుగునేవారికి గమలాక్ష, వెఱపు!
కలిగిరి వెండియుఁ గౌంతేయులనఁగఁ
గలఁగిరి తమలోనఁ గౌరవాధిపులు.
పాండునిపాలిత్తు, బార్థులకనుచు
నిండినకొలువులో నృపుఁడాడె మొన్న;
గురు భీష్మ కృపు లెఱుంగుదు; రిప్పుడతఁడు
పురికిరమ్మని పిల్వఁబుత్తెంచె వీరి.
[1]కీడెంతయెఱుగక కెలనిమెచ్చులకు
వేడుక నటియించు వీరిపైనతఁడు;
అవనిలో ధర్మజుఁ డర్ధ మేలినను,
నవఖండపతివోలె నయమొప్పఁగలడు."
అనినఁ బాంచాలుండు హరియు నిట్లనిరి:
"వినుము, నీకంటే వివేకులు గలరె!
[2]యెన్న మీఁదెఱుగక యీవు పాండవుల
మిన్నక యిట్లేల మేకొనిపిల్వ!

  1. ఈ మాట ధృతరాష్ట్రునిపట్ల నిజమేయైనను, ఈ సందర్భమున రాయబారిగా వచ్చిన
    విదురుఁడు పల్కఁదగినది కాదు.
  2. ఈవాక్యము సందర్భోచితముగాలేదు.