పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

434

ద్విపద భారతము


అనుడుఁ, గోపాటోపమడర రాధేయుఁ
[1]గొనకంట నీక్షించి కుంభజుఁడనియె:
"కలిగితివొకఁడవు! కౌరవకులము
నిలుప! నెవ్వరమును నీసమానులమె!
పాండునందనులతోఁ బగగొని నిలిచి
యుండఁ జూచెదు కర్ణ, యొనరదుగాని,
నినునమ్మి రారాజు నృపతిని విడిచె;
ననిసేయనోపిన నరుగుదు గాక.”
అనునంత, ధృతరాష్ట్రుఁ డయ్యిరువురకు
ఘనతరంబగు కార్యకలహంబు మాన్చి:

విదురుఁడు పాండవులఁ దోడ్తేర నేఁగుట


యీకర్ణకౌరవులేమెఱుంగుదురు!
నాకొడుకులరాక [2]నాకార్య." మనుచు
వివిధవస్త్రంబులు వివిధరత్నములు
వివిధభూషణములు వేడ్కఁ [3] గృష్ణకును,
ఛత్రచామరములుఁ జారుహారములు
ధాత్రినొప్పారు విత్తము ధర్మజునకు,
దాసీసహస్రంబు దంతిశతంబు
వాసిగా ద్రుపదభూవరునకు నిచ్చి
విపులరథంబిచ్చి విదురునిఁబనుప,
నృపునకు మ్రొక్కి యన్నీతికోవిదుఁడు
ఘనవస్తువులతోడఁ గాంపిల్యపురికి
జనుదెంచి, ద్రుపదునిసభఁ జొచ్చి, యందు
శౌరికి భక్తవత్సలునకు మ్రొక్కి ,
కూరిమిదైవాఱఁ గుంతికి మ్రొక్కి,

  1. గొనికొండ
  2. నాకుంగాదెపుడు,
  3. గృష్ణునకు (మూ)