పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

433


ఇల భీమపార్థుల [1] కేఁబిఱుఁదీయఁ ;
గలశజాతుఁడు గెల్వఁగలఁడు పాంచాలు."
ననిన భీష్ముఁడువల్కు: " నందు మీరేఁగి
మును ద్రుపదునిచేత మోసపోయితిరి;
ఎన్నఁబార్థుని చేత నింతికైపోయి
మొన్నగదా ! మీరుమోదులువడుట ;
హరికి సైన్యంబు లేదని తలంచెదరు;
వరచక్రముండంగ వలయునే సేన !
ఈవేళ వారల కెగ్గుచేసినను,
భావింప మీకంటెఁ బగవారు లేరు.
కానఁడుకర్ణుండు కార్యంబుకొలఁది ;
తానఁట ! వారితోఁ దలపడఁగలడె!
పరబుద్ధివినువారి బ్రదుకేమి బ్రదుకు !
వరనీతిఁ బాలిండు వారిరప్పించి."
అనవిని కోపించి యంగరాజనియెఁ:
“దనరంగ దురమన్నఁ దలయేర్చుమీకు;
ముదిసి ముప్పునఁ బ్రాణములు వీడఁజాల ;
రిదికార్యమనికాన; రేలపాలీయ!
కురుకుమారులకీక ఘోరాస్త్రసమితి
హరినందనునకు ద్రోణాచార్యుడీఁడె !
వుట్టినకురురాజుఁ బొలియింపుఁడనుచు
నెట్టనఁ జెప్పరే | నృపునితో మీరు.
అచ్చిపెట్టినజీతమా! బూదిలోని
గచ్చకాయలు [2] మీరకారణహితులె !
ఆమేటివారల నటఁదెచ్చుకొనుట
పాముల నింటిలోపల నిడికొనుట. *

  1. కెబిరుదుదివియ.
  2. మీరు. (మూ )