పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

424

ద్విపద భారతము



కర్మవశంబునఁ గడుబాలుఁడనక
కూర్మి [1]వృద్ధనకుండఁ గూల్ప నావశమె!
తపసినై పోయెదఁ; దగఁ జాలుమణిగ;
మివుడుకోపింపనీ యిఁకబ్రహ్మ.' యనుచు
నైమిశారణ్య పుణ్యక్షోణిఁ జొచ్చి
యామునిశ్రేణితో నద్దేవుఁడచట
సత్రయాగము నిష్ఠ జరుపుచున్నంత,
ధాత్రిఁ జావులు లేక దట్టమై ప్రజలు
తరములతాత లాతరముల తాత
లరయ నవ్వలితాత లాండ్రును దారు
[2]గరిటంటుగాళ ముక్కాలంబుఁ గుడిచి,
గురుకూటములువోలె గోళ్లుమీటుచును,
సుఖమున్నచో, వజ్రి, సొంపుతోనరిగి
...........................................
దండప్రణామముల్ తగనాచరించి
పుండరీకాననుఁ బొందుగా బలికె?:
'ఓ బ్రహ్మ, సంసారమొల్లఁడు శమనుఁ;
డాబ్రహ్మమగుకార్య మటువెట్టిపోయెఁ;
గాలుఁడయ్యును గూడు కాలఁదన్నుదురె!
భూలోక మెడ లేదు పుట్టిన ప్రజకు.'
అనినఁ బల్కు విధాత: 'యట్లేలవగవఁ!
జనియెడుఁ దనకార్యసరణికై యముఁడు,
[3]తనువపేక్ష కరంబుతఱచైనప్రజల
మునుకొని యొకఁడెట్లు మోదు నవ్వేల్పు!
అమర వాయువు నీవు నశ్వినీసురులు
నమరేశ, [4] పిలువఁగ నరుగుఁ; డవ్వేల్పు

  1. వృద్ధునకిట్లు
  2. గరిగంటి
  3. తనువుప్రేక్షకరంబు
  4. పిలువక (మూ)