పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

420

ద్విపద భారతము


శక్రాగ్ని యమ దైత్య జలనాథ వాత
చక్రి భూషాప్తులు సరవితోఁగొలువ,
గంధర్వ సంగీతగతులతోఁ గూడి
బృందారకులు పరివేష్టించి కొలువ,
జావుఁ బుట్టువు లేని సడిసన్న పెద్ద
జీవరాసులకెల్ల జీవంపుముద్ద
యస్త్రప్రాణులలోన నాదివిల్కాడు
[1]శాస్త్రవాదంబుల జగజోలికాఁడు
విసమైన నఱిగించు విషమవైద్యుండు
బిసరుహాసనవైరి[2]విదుల కాద్యుండు
దేవాదిదేవుండు దేవతాత్మకుఁడు
దేవపూజ్యుఁడు మహాదేవుఁ డావేళఁ
బ్రత్యక్షమగుటయుఁ, బద్మాక్షి మ్రొక్కి
ప్రత్యయంబున నిట్లు ప్రణుతింపఁదొణఁగె:
"సత్యాత్మ, సన్మయ, సదమలభావ,
నిత్య, నిత్యానంద, నిర్మలాకార,
శంకర, సర్వజ్ఞ, శాంభవీరమణ,
పంకజభవవంద్య, భవ, వామదేవ,
భర్గ, విరూపాక్ష, భావనాతీత,
సర్గలక్షణకల్ప, సకలనిధాన,
శాశ్వత, భూతేశ, జన్మవినాశ,
విశ్వేశ, విశ్వాద్య, విద్యానవద్య,
త్రినయన, శ్రీకంఠ, త్రిపురసంహార,
ఇనవహ్నిశశినేత్ర, హితజగత్పాత్ర,
ఉగ్ర, నిర్గుణ, గణ్య, యురుతరపుణ్య,
నిగ్రహాప్రతికార, నిరుపమాకార,

  1. శస్త్ర
  2. బిదుల (మూ)