పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

418

ద్విపద భారతము


నల్లనఁబెరిగి, తన్నడిగెడివారి
కెల్లకాలంబునునెదురులు చూచి,
కానక యంతలోఁ గన్నియముదిసి
కానకుఁబోయి శంకరునకుఁదపము
నతిఘోరనిష్ఠఁ జేయఁగ, శంకరుండు
నతివతపంబున కాత్మలో మెచ్చి,
వేదాంతసీమల విహరింపనేర్చు
మేదు ప్రభగల్గు మృదులపాదములు,
గౌరికిఁ గూర్చుండ గద్దియయగుచుఁ
జారలపులితోలు జారినతొడలు,
ముదిపాఁపమొలనూలు ముచ్చుట్టు మలచి
గదురుటేనుఁగుతోలు గట్టిన పిఱుఁదు,
బాగుగా బహుదీప్తి భాసితంబైన
యోగ[1]పట్టముచేత నొప్పునెన్నడుము,
హరివాహ ఘంటాంకు శానల హేతి
వరశూల [2]పరశువుల్ భయదఖడ్గమ్ము
నరుదుగా ధరియించి యరుణనఖాళిఁ
బరిచితంబైనట్టి బాహుదండములు,
గౌరీసమాశ్లేష కలితహస్తముల
నారూఢి నీలిమ హత్తెనోయనఁగ
గంఠమాలికయైన కాలసర్పంబు
కంఠధూమముసోఁకి కందేనోయనఁగ
....................................
....................................
విసమునఁ గనటైన విపులకంధరము,
బసనియెమ్ముల పేర్లు భాసిల్లునురము,

  1. వట్టెయు
  2. భయవజ్ర (మూ)