పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

417


“యువిద, నీతలఁపొప్పు; నొడ[1]వెడుభక్తి;
జవరాలవైయుంటి సంసర్గలేక,
కుసుమమంజరికంటె గోమలంబైన
పసమేనికొప్పైన పాటన లేక,
మాకోపమునకోర్చి, మాసేవనేర్చి,
వే కూరలోపలి వెంట్రుకవోలె
నవసియు నేఁటియన్నము భుజించుటకు
ధవళాక్షి, మెచ్చితిఁ దగ వరమడుగు.'
అనుటయు, సిగ్గు నొయ్యారంబు భయము
దనరార నింతి మౌద్గల్యునిఁజూచి :
"యోదేవ, రతికాంక్ష యుండునుల్లమున;
నైదు దేహంబు లీవర్థి ధరించి,
యనవరతాసక్తి నంగజక్రీడ
ననుఁగటాక్షింపవే! నాకిదివరము;
అంతతో రతికాంక్ష యణగునా." కనినఁ,
గాంతకోరినలాగు గైకొని మౌని
పెక్కులోకంబులఁ బెక్కుకాలములఁ
దక్కక రతికేళి దరళాక్షిఁ గూడి,
యాదేహములువీడి యతఁడుపోవుటయు,
నాదట రతికాంక్షయణఁగక యతివ
యాశరీరమువీడి యవనిపై మఱియుఁ
గాశీశుకడుపునఁ గన్యయైపుట్టి,
చిన్నిప్రాయంబునఁ జెలువున సతుల
కెన్నఁగా నెక్కుడై యిలయెల్లఁబొగడఁ
గమ్మనిశీతాంశుకళయునుబోలె
నమ్మానినీమణి యహరహంబునకు

  1. యదు (మూ)