పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

416

ద్విపద భారతము



వర్తింపఁ, బరిచర్యవదలక యింతి
మార్తాండతేజుగా మగనిఁదలంచి,
మడుఁగుఁ బుట్టంబున మసటువోఁ బుండ్లు
దుడుచుచు నొత్తుచుఁ, దొయ్యలి మఱియుఁ
బురుషుఁడెక్కడకైన బోవలెననిన
నిరవొంద వీపుననిడుకొని చనుచు,
నతఁడుభుజించినయన్నశేషంబు
సతతంబుఁగుడుచుచో, జననాథ! వినుము,
పొనర నమ్మునివ్రేలు భోజనవేళఁ
దునిసి యన్నములోనఁ దొరఁగిన, నింతి
విరిదమ్మిరేకులవీడు పూఁదేనె
కరణి బాష్పంబులు కనుఁగవఁ దొరఁగ:
“నక్కటా! యీ వ్యాధి యర్హమాయితని;
కెక్కడవేగింతు నేమిటమానుఁ;
దునిసి యిప్పుడు వ్రేలు దొరఁగె నన్నమున;
ముని యెంతనొచ్చెనో! ములుగుచున్నాఁడు.
[1]అనగ వాయంద మాసోగభావ
మానయ మాకాంతి యాచక్కఁదనము
నెడపక యెల్లవా! యీకూటఁబడితి;
వొడలంట నిన్నెవ్వ రోసరించెదరు.'
అనుచు నయ్యంగుళి నల్లనఁబుచ్చి,
తనచీర నతనిహస్తముఁ జక్కఁదుడిచి,
హితునిచిత్త మెఱింగి యితర పాత్రమున
నతివ యన్నమువెట్టి యల్లనఁగుడిపి,
యోకరింపక తొంటియోదనంబబల
గైకొని భుజియింపఁ, గడుమెచ్చి మౌని:

  1. అనఘవాయంద మాసొగభావ (మూ)