పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

415



కిసలయతామ్రోష్ఠి, కిన్నెరకంఠి
పసిఁడిశలాకతోఁ బ్రతియైనముగ్ధ.
పతికంటె దైవంబు పడఁతికి లేమి
వితతంబుగా నది విన్నదిగానఁ
తనసుఖంబెఱుఁగక తగువేళ లెఱిఁగి,
[1]జనులతోఁ బలుక సతతంబుఁ బతికి
నోలిమై గ్రాగిన యుదక మార్చుటలు,
మేలిమికూడ్గూర మేళవించుటలు,
నలికిమ్రుగ్గిడి శయ్యయావటించుటలు,
లలిఁ దాళవృంతచాలనము చేయుటలుఁ,
బలుకులవినయంబుఁ, బాదసేవనముఁ,
దెలివినాజ్ఞాక్రియ తీయనిభక్తి,
తాలిమి, యణకువ, తగవు ధైర్యంబు
లాలిత్య మభిరతి లజ్జ మానములు
దయ ధర్మ మతిథిసత్కారంబు నిష్ఠ
ప్రియము దాక్షిణ్యంబుఁ బెంపాదిగాఁగఁ
బుణ్యలక్షణములప్రోవై ధరిత్రి
బుణ్యాంగనలమించి, పూబోణి మఱియుఁ
బతిభక్తిఁబరఁగు; నప్పతి దేహమైన
జతనంబువదలి కుష్ఠవ్యాధిపట్టి
మఱియును నీరుగ్రమ్ముచు [2] నీగకాటు
తఱచునఁజెడి వాచి తద్దయుఁబగిలి
వాసనఁ బ్రేవులు వాతికిరాఁగ
రోసి యెవ్వరు 'నమ్మరో' యని తొలఁగ
నెడపక పాతలనిఁగలఁ జోవుచును,
దడఁబడఁగుంటుచు 'దైవమా ' యనుచు

  1. జనులలో
  2. నింగెకాటు (మూ)