పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

409


బరిగణించిరి, విప్రభాషలుగావు.
ధరణీశ, యొక్కచోద్యము వినుమింకఁ;
జెలువ వారికిఁ జేయుసేవాక్రమంబు
తలఁపవచ్చునె! వింతఁదనమింత లేదు;
ఆవిల్లువంచిన యతని తోయంబు
ఏవురన్నలుఁ దమ్ము లీక్షించి చూడ;
[1] జరఠ యొక్కతె వారి జనని కాబోలు!
వరుస భిక్షాన్నంబు వారికిభుక్తి"
అని వేషధారుల యఖిలవర్తనముఁ
దనయుఁ డెఱింగించె దండ్రి కెంతయును.
అంతటఁ బాంచాలుఁ డమ్మఱునాఁడు
కాంతతో మంత్రిసంఘంబులఁ దాను
నవవేషకుల వర్తనంబు లెఱుంగ
నవిరళంబగు నుపాయంబు దలంచి,
నాలుగురథములు నాల్గుజాతులకు
జూలనొప్పిదముగాఁ జక్కఁబన్నించి
[2]'యేజాతితమజాతియో యారథంబు
రాజిల్లనెక్కి వారలు నగరికిని
వచ్చునట్లుగఁ జేసి వరుసఁదోడ్తెండు
మచ్చిక;' నని చెప్పి మంత్రులననిపె.
పురుషార్థములునాల్గువోలె నారథము
లరుదారఁగొనివచ్చి యామంత్రివరులు
పాండుపుత్రులఁగాంచి భక్తితో మ్రొక్కి :
........................................
"యీవాహనములెక్కి యే తెండు; మిమ్ము
భూవరుండట పిల్వఁబుత్తెంచినాఁడు;

  1. జనని
  2. యేజాతితనజాతియందారథంబు (మూ). అర్థస్ఫూర్తికై యతిభంగమంగీకరించఁబడినది; మూలమునను యతిలేదు.