పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

383



వనజాతముఖి వానివరియింపఁగలది.
వినఁజెప్పుమబలకు వీరులు వినఁగ
సతిభక్తిఁ బేర్వేర సట్టివీరులను
సుతకెఱింగింపుమీ చూపుచు." ననుచు
నెల్లరు వినఁజెప్ప నింతి యామాట
లెల్లను ధరియించె హృదయంబులోన.
ఇదెవచ్చెఁ బాంచాలి యివ్వీధికనుచు
నదెవచ్చెఁ బాంచాలి యవ్వీధికనుచు
నొక్క మొత్తంబులై యువీదపైఁ గవిసి
నిక్కినమెడలెల్ల నిడుపులుగాఁగ
రాజలోకము చూడ, రాజబింబాస్య-
కాజూడచూపుచు నగ్రజుండనియె:

ధృష్టద్యుమ్నుఁడు రాజులఁ బేర్వేర ద్రౌపదికిఁ జూపి చెప్పుట

“మలయజ గంధి, యీమనుజేశుఁజూడు,
మలవడ ముత్యాలహారముల్ వైచి
పన్నగపతివోలె బాహువిస్ఫూర్తి
నున్న వాఁ; డితఁడు పాండ్యుఁడు నీరజాక్షి  !
కుంతలపతివీఁడె కుటిలకుంతలుల
చింతా[1] స్థలులఁగాని చేయఁడు విడిది ;
స్వారాజునకు నాత్మచలియింపుచుండఁ
బారియాత్రావురిఁ బాలించునితఁడు.
మాళవేశ్వరుఁజూడు మదిరాయతాక్షి !
బాలార్కనిభమౌళి భరియించువాఁడు ;
వీని యౌవనమున విహరింప రంభ
మేనక యూర్వసి మెఱసికోరుదురు.

  1. స్థయల (మూ)