పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

380

ద్విపద భారతము



రూపింప నొప్పుకార్ముక మెవ్వఁడేని
మోపెట్టి పంచాస్త్రములు వింటఁ దొడిగి
యంత్రమత్స్యమునేయు, నతఁడు ద్రౌపదికి
మంత్ర దేవతగూర్చు మగఁడు గాఁగలఁడు."
అనిచాటుటయు, విని యారాజలక్ష్ము
లిసుమడింపఁగ రాజులెల్లఁ గైసేసి,
గుంపులై సింగంపుఁగొదమలు వోలె
సంపదమెఱసి పాంచాలిరాగోరి
ధనువువంపకమున్న తమమీద మరుఁడు
ధనువువంపంగఁ బోయి తగినవేడుకను
వందిమాగధులు కైవారముల్ సేయఁ
గ్రందైన మంచలు క్రమముతో నెక్కి,
యెప్పుడెప్పుడు కృష్ణనీక్షింప మాకుఁ
జొప్పడు నని నిక్కిచూచిరెదుళ్లు.
విప్రులు వైశ్యులు [1] వృషలవల్లభులు
గప్రము [2]గంధంబుఁ గై నేసివచ్చి
చెలువఁబాంచాలిఁ జూచినఁజాలు ననుచుఁ
గులములేర్పడ వచ్చి కూర్చుండిరచట.
ద్విజులలోపలవచ్చి ద్విజరాజవంశ్యు
[3]లజిన జటా వల్కలాంచితులగుచు
ఘనమైన రాజలోకములోనఁ జొచ్చి
పొనర నందఱకంటెఁ బొడవు దీపింపఁ
గొనకొన్న వేడుకఁ గూర్చుండి రంత.
కొనియాడు మానవకోటుల రవముఁ,
దునియని పటహాది తూర్యరవంబుఁ,
జెలఁగు భూసురుల యాశీర్వాదరవముఁ,
బలుకు లోకుల పక్షపాతరవంబుఁ
 

  1. ద్రిపద
  2. గంధింప
  3. అజిత. (మూ )