పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

379


'రాకమానరు పాండురాజనందనులు
నాకుఁజూడఁగఁగల్గు సయమొప్ప' ననుచు
నారాయణుఁడు వచ్చి నలుగడ [1] వృష్ణి-
వీరులు నేవింప విందుప్రోలికిని.
ఈరీతి మఱియు ననేకులు నృపులు
వారాశివలయిత వసుమతినుండి
చిగురుఁబోఁడి విరాలిచిక్కముచేరు
తిగిచినకరణి సంధిలిరి తత్పురిని.
ఉర్విమోపరులెల్ల నొకవంకఁ గూడ
నుర్విభారము శేషుఁడోర్వలేఁడయ్యె.
పనిగొని సేనతోఁ బాంచాలుఁడట్టి
యినసోమవంశ్యుల కెదురుగాఁ బోయి
తడయక తోడ్తెచ్చి తగు విడిదలల
విడియించి, వారికి విభవంబుమెఱసి
యుపచారములుసేయ, నొకరీతి రాత్రి
నృపులువేగించిరి నెలఁతరాఁగోరి.
ఆఁడుబిడ్డకును స్వయంవరోత్సవము
నేడని ద్రుపదుండు నిజపురిలోనఁ
జాటింపంబనిచిన, శంబరారియును
బాటింపఁబనిచెను బాణ సంపదను.
మఱునాఁడు ద్రుపదుండు మనుజేంద్రసభలఁ
దఱిగొని యింద్రనందను వెదకించి
కానక, గజముపై గంటయెత్తించి
జూనొప్ప నిట్లని చాటఁబుత్తెంచె:
"మంచలమీద వేమాఱుండి మిగుల
సంచిత పుష్పగంధాదులవలన

  1. దృష్టి. (మూ)