పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

375


జననీసమేతులై సాగిలి మ్రొక్క,
ముని వారిఁ బూజించి ముఖవికాసమున:
"నేమొకొ ! వచ్చితి రిటనన్ను వెదకి;
భూమి మీవృత్తాంతములు వినియుందు;
దుర్యోధనుఁడు సేయుదుష్కార్యములకు
గార్యంబువుట్టనికణఁక వర్తింత్రు.
మిముఁ [1] గూల్చువారైన మీరు చింతించి
సమబుద్ధినున్న మీశాంతి పర్ణింతు.
వేడుక తళుకొత్త [2] విభులార, మిమ్ముఁ
జూడఁగంటిమి నేడు సుదినంబుమాకు,
మీరుకాలిన వార్త మేదిని మ్రోయఁ
గౌరవకుల మేను గాల్పఁజింతించి,
మఱి యోగదృష్టి మీమనికి యెఱింగి
మఱవకున్నారము మముఁ గాంతురనుచు.
పరమకళ్యాణంబు పాంచాలువీఁట
దొరకొనుమీకు బంధువులెల్ల నెఱుఁగ.
అప్పుడు విని మిమ్ము నాంబికేయుండు
రప్పించి మఱి యర్ధరాజ్యమీఁగలడు."
అనిన సంతోషించి యతనికిఁ బాండు-
తనయులిట్లనిరి : "మీతత్త్వమిట్టిదియె;
ఇచ్చలో మిముఁ బురోహితునిఁగాఁ గోరి
వచ్చితిమిచటికి; వాత్సల్యలీల
ననుమతిచేసి మమ్మనుపుదుగాక;
చనవలెఁ గాంపిల్యజనపదంబునకు, "
అనుటయు నట్లకాకని పురోహితము
మునియియ్యకొని ప్రియంబున వీడుకొలుపఁ,

  1. గెల్చువారుగా
  2. విధులార (మూ)