పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

323



అని పులస్త్యాదు లిట్లానతిచ్చినను
విని పరాశరమౌని వేడ్కనిట్లనియె:
"[1]మీవాక్యమంతయు మీఱక [2] సేతు;
నేవిధంబుననార్తు నీమహావహ్ని?”
అనిన మౌనులు పల్కి : "రనఘాత్మ, దీని
నొనర హేమాద్రికి నుత్తరంబునను
గడుఘోరమైయుండుకాననమందు
వెడలింపు [3]మీ" వన్న వేగంబె పోయి
యనలంబు గైకొని యప్పరాశరుఁడు,
మునుల వీడ్కొల్పి యిమ్ముల నంతలోన
దనుజాటవీ దాహ దావాగ్నిఁ బోలు
ఘనతరాటవిలోనఁ గడువేగ వైచె
వైచిన నాచిచ్చు వనమెల్లనిండి
యేచి దావాగ్నియై యెప్పుడుమండె,
నప్పుడు శాక్తేయుఁ డలుకచాలించి
తప్పక చనుదెంచి తాతకు మ్రొక్కి,
యవ్వకుఁ దల్లికి నతిభక్తి నెఱఁగి,
మవ్వంపుదపములు మహిఁజేయుచుండె.
అట గౌశికుండును నతిఘోరతపము
పటుబుద్ధి గావించి బహువత్సరములు
బ్రహ్మసంభవుచేత బ్రహ్మమెచ్చంగ
బ్రహ్మమునిత్వంబు భక్తితోఁబడసి,
యావశిష్ఠునకును నబ్జసంభవున
కేవెంట సరివచ్చి యెలమివర్తించె.
అనఘ, తపశ్శక్తి నందంగరాని
ఫలములుగలవె! సంభావితాత్ములకు.

.
  1. మీకార్య
  2. పోలంగ నేడాజిభూమిగైసేతు, రం.నా.రా.యు.కా
  3. మీయగ్ని వేగంబె యనిన (మూ )