పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

372

ద్విపద భారతము

పొనరఁ బులస్త్యాదిమునులఁ బుత్తేర,
ననఘు లేతెంచి రయ్యజ్ఞవాటికకు.
ఆరీతి వచ్చినయమ్మునీంద్రులకు
నారీతినర్ఘ్యాదులప్పరాశరుఁడు
గారవంబుననిచ్చి, కలితాసనములు
ధీరతఁబెట్టించి దృఢభక్తిఁబలికె :
“ఓమహాత్మకులార, యోగ్యులుమీర
లీమహికే తెంచుటేమికారణము?
ఏనుధన్యుఁడనైతి; నింక నాపితరు
లానిన సౌఖ్యంబులనుభవించెదరు.
ఏపని నాచేత నెసగుమీకిపుడు?
చేపట్టి దయతోడఁ జేయించుకొనుఁడు."
అనినఁ బులస్త్యాదు లాశక్తిసుతుని
వినయంబునకు [1]మెచ్చి వేడ్కనిట్లనిరి:
"మహితాత్మ, నీయట్టిమనుమండు గలుగ
మహి వశిష్ఠుండు నెమ్మదినున్నవాఁడు;
ఆమహాత్మునిధైర్య మాశాంతగుణము
నేమంబుతోఁ జెప్పనేర్తుమె మేము!
అతనితోఁ బగగొని యాకౌశికుండు
[2]మతకముసల్పిన, మాయదానవుఁడు
తినియె మీతండ్రుల దేవసన్నిభుల.
దనుజులుచేసినతప్పు గాదదియు;
వారును మీతాత వరతపోమహిమ
బోరనఁ గాంచిరి పుణ్యలోకములు;
కావున నీవింక ఘనరోషముడుగు;
కావింపవలవ దీక్రతువు చాలింపు.”

  1. మ్రొక్కి
  2. సుతమునబల్కిన (మూ)